Chandrababu: ఇంటికో స్మార్ట్ ఫోన్ ఇస్తే ఎలా ఉంటుంది?: కలెక్టర్లను అడిగిన చంద్రబాబు

  • ప్రతి కుటుంబానికీ డిజిటల్ నాలెడ్జ్
  • ప్రతి లబ్ధిదారు ఇంటి వద్ద ఒక స్టిక్కర్‌
  • కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ డిజిటల్ నాలెడ్జ్ ని దగ్గర చేసేలా ఇంటికో స్మార్ట్ ఫోన్ ను ప్రభుత్వమే స్వయంగా అందిస్తే ఎలా ఉంటుందని కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడిగారు. నిన్న అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని మరింత దగ్గర చేసేందుకు సలహాలు, సూచనలు ఇస్తే తాను స్వీకరిస్తానని అన్నారు.

తనకున్న ఆలోచనలను అధికారులతో పంచుకున్న చంద్రబాబు, వారిచ్చిన సూచనలను సైతం ఆసక్తిగా ఆలకించారు. ప్రతి కుటుంబం వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉండటం అవసరమని వ్యాఖ్యానించిన ఆయన, చేస్తున్న అభివృద్ధి కనిపించేలా చేయడం కోసం ఇంకా ఏమేమి చేయవచ్చో సూచించాలని అన్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమాన్ని పొందే ప్రతి లబ్ధిదారు ఇంటి వద్ద ఒక స్టిక్కర్‌ వేయాలని, పార్టీ, రాజకీయాలు, వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ముద్ర, జన్మభూమి చిహ్నం మాత్రమే ఈ స్టిక్కర్ పై ఉండేలా చూడాలని కూడా చంద్రబాబు సూచించారు.

More Telugu News