England: ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ భార్య మృతి

  • 12 నెలలుగా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స
  • చికిత్స కోసం డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న ఆండ్రూ
  • కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఫౌండేషన్

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్టాస్ భార్య రూత్ స్ట్రాస్ (46) ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ నేడు మృతి చెందారు. గతేడాది డిసెంబర్‌లో ఆమెకు కేన్సర్ అని తేలడంతో అప్పటి నుంచి లండన్‌లోని యూనివర్సిటీ ఆసుపత్రిలో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రూత్ చికిత్స నిమిత్తం ఆండ్రూ... ఇంగ్లండ్ డైరెక్టర్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు.

తన భార్య మృతిపై ఆండ్రూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘రూత్ ఊపిరితిత్తుల కేన్సర్‌తో మృతి చెందిందని చెప్పేందుకు చాలా బాధగా ఉంది. 12 నెలలపాటు ఆమెకు వైద్యం అందించిన లండన్‌ యూనివర్సిటీ ఆసుపత్రి సిబ్బందికి నా ధన్యవాదాలు. ఆమె అంత్యక్రియలు తను పుట్టిన ఆస్ట్రేలియాలో నిర్వహిస్తాము. అలాగే ఆమె కోరిక మేరకు ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకొనేందుకు త్వరలో ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తాను’’ అని ఆండ్రూ స్ట్రాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

More Telugu News