cinema: ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన తెలుగు చిత్ర పరిశ్రమ

  • సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం
  • జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ
  • రూ. 900 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనున్న ప్రభుత్వం

సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. రూ. 100 వరకు ధర కలిగిన టికెట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. రూ. 100కు పైగా ధర ఉన్న టికెట్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, టికెట్లపై జీఎస్టీని తగ్గించినందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలుగు సిని పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 23 రకాల వస్తు, సేవలపై జీఎస్టీని తగ్గించిన సంగతి తెలిసిందే. సవరించిన జీఎస్టీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు, సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ. 900 కోట్ల మేర ఆదాయం తగ్గనుంది.

More Telugu News