rrr: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి మరో తాజా వార్త

  • విలన్ గా యష్ ను తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలు
  • రానాను తీసుకున్నట్టు తాజాగా ప్రచారం
  • అధికారికంగా వెలువడని ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా దర్శక దిగ్గజం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభంకానుంది. మరోవైపు, ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే... నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. విలన్ రోల్ ను రానా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. కన్నడ స్టార్ హీరో యష్ ను విలన్ గా తీసుకున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా మాత్రం ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఈ చిత్రంలో విలన్ ఎవరో... లేదా ఇద్దరు విలన్లు ఉంటారా? అనే విషయం తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

More Telugu News