Andhra Pradesh: ఒంగోలులో ఇంటర్ విద్యార్థి సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు!

  • రాజారెడ్డికి చదువు ఇష్టం లేదు
  • రెండుసార్లు కాలేజీ నుంచి పారిపోయాడు
  • తల్లిదండ్రుల ఒత్తిడితోనే ఆత్మహత్య

ఒంగోలు జిల్లాలోని శ్రీ ప్రతిభ ఇంటర్ కాలేజీ విద్యార్థి రాజారెడ్డి(16) రెండ్రోజుల క్రితం సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రకాశం పోలీసులు ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త కోణం బయటపడింది. చదువుకోవడం ఇష్టంలేని రాజారెడ్డి గతంలో కాలేజీ నుంచి రెండు సార్లు వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే అతను కాలేజీకి తిరిగి వచ్చాడని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇతనికి బెట్టింగ్ కాసే అలవాటు కూడా ఉందని వెల్లడించారు.

ఆత్మహత్యకు ముందు రాజారెడ్డి ఓ పెట్రోల్ బంకుకు వెళ్లి ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీల్లో రికార్డు అయిందని పోలీసులు పేర్కొన్నారు. పెట్రోల్ కొనుగోలు చేశాక కాలేజీ వెనుకవైపు ఉన్న గేటువద్దకు చేరుకుని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. చదువుకోవడం ఇష్టంలేకపోయినా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతోనే రాజారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News