pulwama: పుల్వామాలో నలుగురు టెర్రరిస్టులను కాల్చి చంపిన సైన్యం

  • పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కార్డన్ సెర్చ్
  • భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించిన టెర్రరిస్టులు
  • సాంబ సెక్టార్ లో రెండు ఏకే 47 తుపాకులు స్వాధీనం

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చి చంపాయి. దక్షిణ పుల్వామా జిల్లాలో ఉండే హంజన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలతో భద్రతాబలగాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ ను చేపట్టాయి.

ఈ నేపథ్యంలో, తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే పూర్తి అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. మరోవైపు, జమ్ములోని సాంబ సెక్టార్ లో నిన్న అర్ధరాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భూమిలో పాతిపెట్టిన రెండు ఏకీ 47 తుపాకులు, భారీ ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News