కోర్టు విభజన మీద ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదేం?: డొక్కా మాణిక్య వరప్రసాద్‌

29-12-2018 Sat 12:33
  • కేంద్రం తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ
  • సమస్యలను గుర్తించరా
  • విభజన సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. కోర్టును విభజించడంపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా ప్రకటించడంపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఏళ్ల నుంచి పోరాడుతున్నా పట్టనట్లు నటిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టును మాత్రం హడావుడిగా విభజించడంలోని కారణాలు వెల్లడించాలని కోరారు. దీనివల్ల ఎదురయ్యే సమస్యలు పట్టించుకోకుండా ఎందుకంత హడావుడిగా చేశారో చెప్పాలని అన్నారు. కోర్టును హడావుడిగా తరలించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు.