vikram: 'కదరం కొందన్' నుంచి ఆసక్తిని రేపుతోన్న విక్రమ్ లుక్

  • కమలహాసన్ నిర్మాతగా 'కదరం కొందన్'
  • విక్రమ్ జోడీగా అక్షర హాసన్ 
  • సంగీత దర్శకుడిగా గిబ్రాన్  

తెలుగు .. తమిళ భాషల్లో విక్రమ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో విలక్షణ నటుడిగా ఆయన ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. అదే పద్ధతిని పాటిస్తూ ఆయన మరో విభిన్నమైన సినిమాను చేస్తున్నాడు .. ఆ చిత్రం పేరే 'కదరం కొందన్'. కమలహాసన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో విక్రమ్ సరసన అక్షర హాసన్ కథానాయికగా కనిపించనుంది. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోలుక్ ను వదిలారు .. విక్రమ్ ను డిఫరెంట్ గా చూపుతోన్న ఈ లుక్ కూడా ఆసక్తిని రెత్తిస్తోంది. రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. తన కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలవడం ఖాయమనే నమ్మకంతో విక్రమ్ .. ఆయన అభిమానులు వున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

More Telugu News