rajani: కన్నడలోను 'పేట' విడుదల ఖరారు!

  • కన్నడలోను అనువాద చిత్రాల జోరు 
  • '2.ఓ'కి విశేషంగా లభించిన ఆదరణ 
  • కన్నడలోను సందడి చేయనున్న 'పేట'

రజనీకాంత్ తాజా చిత్రంగా .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'పేట' నిర్మితమైంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రజనీ మాస్ లుక్ కి .. మాస్ స్టెప్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నడలోను విడుదల కానుండటం రజనీ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. తమ చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి అక్కడివారు ఇన్నాళ్లూ డబ్బింగ్ చిత్రాల విడుదలను నిరోధిస్తూ వచ్చారు. అయితే, ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. డబ్బింగ్ చిత్రాలకు మెల్లిగా సడలింపు లభిస్తోంది. ఇటీవల కన్నడలో విడుదలైన '2.ఓ' 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు 'పేట' సినిమా కూడా కన్నడలో విడుదల కానుంది. రజనీకి కర్ణాటకలో వున్న ఫాలోయింగ్ కారణంగా అక్కడ కూడా ఈ సినిమా దుమ్మురేపేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

More Telugu News