rajani: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న '2.ఓ'

  • 100 మిలియన్ డాలర్స్ రాబట్టిన చిత్రాలు 53
  • ఇండియా నుంచి రెండు సినిమాలకి చోటు
  • రజనీ అభిమానులు ఫుల్ ఖుషీ    

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' భారీ వసూళ్లను రాబట్టింది. ఓపెనింగ్స్ నుంచి కొత్త రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా, మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 700 కోట్లను (100 మిలియన్ డాలర్స్)ను వసూలు చేసింది.

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 మాత్రమే. ఈ జాబితాలో ఇండియా నుంచి 2 సినిమాలు మాత్రమే వున్నాయి. ఒకటి ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్' .. మరొకటి రజనీ '2.ఓ'. అయితే 'సీక్రెట్ సూపర్ స్టార్' చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. '2.ఓ' మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం విశేషం. మొత్తానికి రజనీకాంత్ అభిమానులు ఆశించినట్టుగానే ఈ ఏడాది ఒక అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నాడన్నమాట. 

More Telugu News