secunderabad: ప్రయాణికులను బాదేందుకు సిద్ధమైన రైల్వే.. ఫ్లాట్ ఫాం టికెట్ ధర రెండింతలు

  • రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచిన రైల్వే
  • సాగనంపేందుకు వచ్చే వారిని నియంత్రించేందుకే
  • జనవరి 9 నుంచి 17 వరకు అమలు

ప్రయాణికుల సౌకర్యార్థం పేరిట పండుగ రోజుల్లో ప్రయాణికులను బాదేందుకు సిద్ధమైన దక్షిణ మధ్య రైల్వే మరోమారు అదే పనిచేసింది. సంకాంత్రి సెలవుల నేపథ్యంలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రెండింతలు చేసింది. పండుగకు ఊరెళ్లే వారితో పాటు వారిని సాగనంపేందుకు వచ్చే వారితో స్టేషన్లు కిక్కిరిసిపోయే పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

 సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో జనవరి 9 నుంచి 17వ తేదీ వరకు అంటే 9 రోజుల పాటు ప్లాట్‌ఫాం టికెట్ ధరను పది రూపాయల నుంచి రూ. 20కు పెంచింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ తెలిపారు. పండుగ సీజన్‌లో ప్రయాణికులు కాని వారు కూడా పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలి వస్తుండడంతో అసలు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంటోందని, దీనిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

More Telugu News