samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రోస్థటిక్ మేకప్ వాడుతున్న సమంత 
  • న్యూ ఇయర్ రోజున బన్నీ సినిమా ప్రకటన
  • విశాఖలో రేపు 'ఎఫ్ 2' ఆడియో వేడుక  

*  నందిని రెడ్డి దర్శకత్వంలో అందాల సమంత నాయికగా నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. సమంత డబ్బై ఏళ్ల బామ్మగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె కొడుకుగా రావు రమేశ్ నటిస్తున్నారు. ఇందులో సమంత పూర్తి స్థాయి ప్రోస్థటిక్ మేకప్ వాడుతున్నారట. ఈ చిత్రానికి 'ఓ బేబీ' టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజున ప్రకటిస్తారట.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం ఆడియో వేడుకను రేపు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో రేపు సాయంకాలం ఈ వేడుక జరుగుతుంది.

More Telugu News