panner selvam: జయ మృతి కేసులో పన్నీర్‌ సెల్వంకు సమన్లు

  • పన్నీర్, తంబిదురై, రిచర్డ్ బీలేలకు సమన్లు
  • తమ ముందు హాజరు కావాలన్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్
  • ఇప్పటి వరకు 145 మందిని విచారించిన కమిషన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కేసును విచారిస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. పన్నీర్ తో పాటు లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, జయకు వైద్యం అందించిన అమెరికా వైద్యుడు రిచర్డ్ బీలేకు కూడా సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న కూడా పన్నీర్ కు సమన్లు జారీ చేసినప్పటికీ... ఆయన హాజరుకాలేదు. దీంతో, తమ ఎదుట హాజరు కావాలంటూ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది.

జనవరి 7న విజయభాస్కర్, జనవరి 8న పన్నీర్ సెల్వం, 11న తంబిదురై తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. జనవరి 7న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని రిచర్డ్ బీలేకు సూచించింది. ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి అపోలో వైద్యులతో పాటు 145 మంది సాక్షులను కమిషన్ విచారించింది.

More Telugu News