the accidental prime minister: 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాపై మన్మోహన్ సింగ్ స్పందన

  • వివాదాస్పదమైన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు
  • నో కామెంట్ అంటూ స్పందించిన మన్మోహన్

'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమా ట్రైలర్ దేశ వ్యాప్తంగా వేడిని రాజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సినిమాను తొలుత తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మన్మోహన్ సింగ్, సోనియాగాంధీల గౌరవాన్ని తగ్గించేలా ఈ చిత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో మన్మోహన్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రచించిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఈరోజు మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించారు. దీనికి ఆయన తన స్పందనగా, 'నో కామెంట్' అంటూ వెళ్లిపోయారు. కాంగ్రెస్ 134వ వ్యవస్థాపకదినం వేడుకల నేపథ్యంలో, ఈరోజు మన్మోహన్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా, 'మీపై తీసిన సినిమాపై మీరు ఏమనుకుంటున్నారు' అని మీడియా ప్రశ్నించింది. ఒక్క క్షణం అక్కడ ఆగి... నో కామెంట్ అంటూ ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

More Telugu News