rajani: దుమ్మురేపేస్తోన్న 'పేట' ట్రైలర్

  • రజనీ తాజా చిత్రంగా 'పేట'
  • భారీ తారాగణంతో సందడి
  • తమిళ .. తెలుగు భాషల్లో రిలీజ్          

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ 'పేట' సినిమా చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో జనవరి 10వ తేదీన తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజనీ .. సిమ్రాన్ .. త్రిష .. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.యాక్షన్ .. కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. రజనీ మరింత యంగ్ గా .. మరింత స్టైల్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ చివరిలో మాస్ లుక్ తో .. మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు చూసి తీరవలసిందే. రజనీ సినిమా నుంచి అభిమానులు ఆశించే జోష్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమైపోతోంది. తెలుగు .. తమిళ భాషల్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ, రజనీ తనదైన స్టైల్ సందడి చేస్తాడనే అనిపిస్తోంది.

More Telugu News