Telangana: వరంగల్ మేయర్ పదవికి టీఆర్ఎస్ నేత నన్నపునేని నరేందర్ రాజీనామా!

  • టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక
  • వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం
  • కమిషనర్ కు రాజీనామా పత్రాల సమర్పణ

టీఆర్ఎస్ నేత, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తన పదవికి రాజీనామా సమర్పించారు. మేయర్ పదవితో పాటు గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని నరేందర్ గ్రేటర్ కమిషనర్ వీపీ గౌతమ్ కు పంపిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ పై నరేందర్ గెలుపొందారు.

ఈ నేపథ్యంలో తన మేయర్, కార్పొరేటర్ పదవులకు ఆయన రాజీనామా సమర్పించారు. రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు నరేందర్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్.. కార్పొరేషన్ స్థాయి నుంచి గ్రేటర్ స్థాయికి ఎదిగిన తర్వాత తొలి మేయర్‌గా పని చేశారు.

ఆయన హయాంలోనే వరంగల్ కార్పొరేషన్‌కు దేశ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. దేశంలో 4,500 నగరాలు స్వచ్ఛ సర్వేక్షన్‌లో పోటీపడగా వరంగల్ కార్పొరేషన్‌కు 28వ ర్యాంకు తీసుకురావడంలో మేయర్‌గా నరేందర్ కీలక పాత్ర పోషించారు.

More Telugu News