Uttar Pradesh: బులంద్‌షహర్ కేసులో కీలక పరిణామం.. సీఐని కాల్చిన కారు డ్రైవర్ అరెస్ట్

  • సీఐని చంపింది తానేనని అంగీకరించిన కారు డ్రైవర్
  • నిందితుడికి పలు నేరాలతో సంబంధం
  • కీలక నిందితులు పరారీలో

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గో రక్షకులు జరిపిన హింసాకాండకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 3న జరిగిన ఈ హింసాకాండలో సీఐ సుబోధ్ కుమార్ సింగ్‌తోపాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పలు మలుపులు తిరిగిన సీఐపై కాల్పుల కేసులో తాజాగా కారు డ్రైవర్‌ ప్రశాంత్ నాథ్‌ను పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌పై కాల్పులు జరిపింది అతడేనని నిర్ధారించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సుబోధ్‌‌ను చంపేందుకు ఉపయోగించిన తుపాకి మాత్రం దొరకలేదు.

సీఐని చంపింది తానేనని ప్రశాంత్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌కు గతంలో పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో బజరంగ్‌దళ్‌కు చెందిన యోగేశ్ రాజ్, బీజేపీ నేత శిఖర్ అగర్వాల్, ఉపేంద్ర రాఘవ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News