vinaya vidheya rama: ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి, రామ్ చరణ్ లకు ఘనస్వాగతం

  • యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక
  • బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’
  • త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ హాజరు 

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. హీరో రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ సాయంకాలం హైదరాబాద్, యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్, కొద్ది సేపటి తర్వాత మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘మెగా’ హీరోలకు అభిమానులు ఈలలు, చప్పట్లతో స్వాగతం పలికారు. కాగా, ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News