Terrorists: ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ అధికారులపై ప్రశంసలు!

  • యూపీ, ఢిల్లీలలో ఏకకాలంలో తనిఖీలు
  • ‘హర్కత్ ఉల్ హర్క్ ఎ ఇస్లాం’ సభ్యుల అరెస్ట్
  • జనవరి 26న పేలుళ్లకు ప్లాన్

దేశంలో పలు చోట్ల పేలుళ్లు సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్న ఉగ్రవాదుల కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో నిన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ‘హర్కత్ ఉల్ హర్క్ ఎ ఇస్లాం’ ముఠా సభ్యులు 10 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా జనవరి 26న దేశంలోని వివిధ చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు.

ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజీజు ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘అత్యంత ప్రమాదకర పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసినందుకు ఎన్‌ఐఏకు అభినందనలు’ అని అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ఇక కిరణ్ రిజీజు.. ‘ఎన్ఐఏ ఏర్పడిన దగ్గర నుంచి మంచి పనితీరు కనబరుస్తోంది. ప్రమాదకర  ఘటనలు జరగకుండా అడ్డుకున్నందుకు ఎన్ఐఏకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

More Telugu News