ap high court: ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ నియామకం

  • రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ
  • క్రిమినల్ లాయర్ గా ప్రవీణ్ కుమార్ ప్రసిద్ధి
  • ఓయూలో న్యాయవిద్య అభ్యసించిన ప్రవీణ్ కుమార్

ఏపీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ విధులు నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, 1961లో ప్రవీణ్ కుమార్ జన్మించారు. హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో న్యాయవిద్య పూర్తి చేశారు.1986లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2012లో ఏపీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, పూర్తి స్థాయి జడ్జిగా 2013లో నియమితులయ్యారు. క్రిమినల్ లాయర్ గా ప్రవీణ్ కుమార్ కు మంచిపేరు ఉంది.

More Telugu News