Rajasthan: రాజస్థాన్ కేబినెట్.. గెహ్లట్ కు 9, పైలట్ కు 5 శాఖలు

  • ఆర్థిక శాఖ, ఎక్సైజ్, ఐటీ తదితర శాఖలు గెహ్లాట్ చేతిలోనే
  • పైలట్ కు గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ తదితర శాఖలు
  • 13 కేబినెట్, 10 సహాయ మంత్రులకు శాఖల కేటాయింపు

రాజస్థాన్ మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సూచన మేరకు గవర్నర్ కల్యాణ్ సింగ్ పోర్ట్ ఫోలియోలను కేటాయించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ కీలకమైన 9 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటిలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ, ఎక్సైజ్, ప్లానింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్, సాధారణ పరిపాలన, ఐటీ తదితర శాఖలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు పబ్లిక్ వర్క్స్, గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్ శాఖలను కేటాయించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులలో పాటు 13 కేబినెట్, 10 సహాయ మంత్రులకు శాఖలను కేటాయించారు. నిన్న రాహుల్ గాంధీతో అశోక్ గెహ్లాట్ సమావేశమైన తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు.

More Telugu News