charan: మలయాళంలో చరణ్ సినిమాల సందడి

  • మలయాళంలోకి 'రంగస్థలం'
  • జనవరి 18వ తేదీన విడుదల 
  • 25వ తేదీన 'వినయ విధేయ రామ'  

చరణ్ కథానాయకుడిగా తెలుగులో వచ్చిన 'రంగస్థలం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమాను కేరళలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 18వ తేదీన ఈ సినిమాను అక్కడ భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఇక చరణ్ తాజా చిత్రంగా 'వినయ విధేయ రామ' సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కూడా కేరళలో విడుదల చేయనున్నారు. జనవరి 25వ తేదీన అక్కడ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఒకే నెలలో .. చాలా తక్కువ గ్యాప్ లో మలయాళ ప్రేక్షకుల ముందుకు చరణ్ సినిమాలు వెళుతుండటం విశేషం. ఈ రెండు సినిమాలకి మంచి రెస్పాన్స్ వస్తే, అక్కడ చరణ్ మార్కెట్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News