India: 443 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్!

  • తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయిన తరువాత డిక్లేర్
  • సెంచరీ సాధించిన పుజారా, రాణించిన కోహ్లీ, మయాంక్
  • బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా, రెండో రోజు 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన వేళ, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. నేడు కనీసం 10 ఓవర్ల పాటు ఆసీస్ ను బ్యాటింగ్ చేయించాలన్న ఉద్దేశంతోనే ఇండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది.

 భారత ఇన్నింగ్స్ లో హనుమ విహారి 8, మయాంక్ అగర్వాల్ 76, పుజారా 106, కోహ్లీ 82, రహానే 34, రిషబ్ పంత్ 39, రవీంద్ర జడేజా 4 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 63 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కుమిన్స్ కు 3 వికెట్లు దక్కగా, స్ట్రార్క్ 2, లియాన్ ఒక వికెట్ ను పడగొట్టారు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్ ప్రారంభించగా, తొలి ఓవర్ ను ఇషాంత్ శర్మ వేశాడు.

More Telugu News