Police: పోలీస్ అధికారి కుమార్తెపై విద్యార్థుల గ్యాంగ్ రేప్!

  • ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘటన
  • బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు
  • స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లో కామాంధులు రెచ్చిపోయారు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న ఓ యువకుడు, తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా వీరి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. కాగా, బాలిక తండ్రి సాక్షాత్తూ పోలీస్ ఇన్ స్పెక్టర్ కావడంతో నలుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీలోని కాన్పూర్ లో ఉంటున్న ఓ బీటెక్ విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(12)తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సదరు బాలికకు మాయమాటలు చెప్పి తన ఫ్లాట్ కు రప్పించుకున్న బీటెక్ విద్యార్థి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News