flipkart: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం షాక్!

  • ఈ-కామర్స్ సంస్థలపై కఠిన నిబంధనలు
  • వాటాలున్న కంపెనీల ఉత్పత్తులు విక్రయించ కూడదు
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పక్కాగా ఉండాల్సిందే

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు విక్రయించే ఉత్పత్తుల విషయంలో కేంద్రం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను ఆయా సంస్థలు విక్రయించరాదని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఉత్పత్తిదారులను ఏదైనా ఓ వస్తువును తమ సంస్థలోనే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించాలన్న నిబంధనను తప్పనిసరి చేయకూడదని, ఇందుకోసం ఎటువంటి ఒత్తిడి తీసుకు రాకూడదని తేల్చి చెప్పింది.

ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లలో వస్తువుల విక్రయంపై వినియోగదారులకు ఆఫర్ చేసే ‘క్యాష్‌బ్యాక్’ చాలా స్పష్టంగా ఉండాలని, ఎటువంటి వివక్షకు తావులేకుండా ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆయా కంపెనీల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాటాలు కలిగిన కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుందని వివరించింది.

More Telugu News