Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రకుల్ సినిమా షూటింగ్ పూర్తి 
  • ముఖ్య పాత్ర పోషిస్తున్న దర్శకుడు
  • దర్శకుడు క్రిష్ కు ఎన్టీఆర్ అవార్డు 

*  కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'దేవ్' చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా ఓ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. మలయాళ చిత్రం 'తంగమలై డైరీస్' ఆధారంగా తెలుగులో రూపొందుతున్న 'ఫలక్ నూమా దాస్' చిత్రంలో తరుణ్ నటిస్తున్నాడు. ఆమధ్య 'మహానటి' సినిమాలో కూడా ఈయన ఓ పాత్ర పోషించాడు.
*  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ప్రముఖ దర్శకుడు క్రిష్ కు ఎన్టీఆర్ పేరిట ఏర్పాటైన అవార్డును ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను హైదరాబాదులోని ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈ అవార్డుకు క్రిష్ ను ఎంపిక చేసింది. ఈ నెల 30న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

More Telugu News