President: 'రాష్ట్రపతి అంగరక్షకుల ఉద్యోగాలు ఆ మూడు కులాల వారికేనా?' అంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్.. నోటీసులు జారీ చేసిన ధర్మాసనం!

  • నేను యాదవ కులానికి చెందిన వాడిని
  • ఆ పోస్టుకు తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి
  • మూడు సామాజిక వర్గాలకే ప్రాధాన్యం

రాష్ట్రపతి అంగరక్షకుల నియామక ప్రక్రియలో జాట్లు, జాట్ సిక్కు, రాజ్‌పుత్‌ సామాజిక వర్గాల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తాను యాదవ కులానికి చెందిన వాడినని, రాష్ట్రపతి అంగరక్షకుడి స్థానానికి ఉండవలసిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని.. కానీ కేవలం మూడు సామాజిక వర్గాలకు చెందిన వారి దరఖాస్తులను మాత్రమే గతేడాది సెప్టెంబరులో ఆహ్వానించారని హరియాణాకు చెందిన గౌరవ్ యాదవ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈయన తరఫు న్యాయవాది రామ్ నరేశ్ మాట్లాడుతూ... రాష్ట్రపతి అంగరక్షకుడి పదవికి అర్హతలున్నవారిని పక్కనబెట్టి కేవలం మూడు సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ మురళీధర్, సంజీవ్ నారూలాతో కూడిన ధర్మాసనం.. పిటీషన్‌పై రక్షణ మంత్రిత్వశాఖ, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్ లు నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఇతరత్రా ఏమైనా వివరణలు ఇవ్వదలిస్తే వచ్చే ఏడాది మే 8 వరకూ హైకోర్టు గడువిచ్చింది. 

More Telugu News