Stock Market: నేటి మార్కెట్లు: మొదట్లో నష్టాలు.. చివర్లో లాభాలు!

  • తొలి నుంచీ మార్కెట్ల ఊగిసలాట
  • ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్ల డౌన్ 
  • చివర్లో 180 పాయింట్ల లాభం 

ఈ రోజు మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచీ అమ్మకాల ఒత్తిడితో పలు సూచీలు నష్టాలలో ట్రేడ్ అవడంతో మార్కెట్లు చివరి వరకు ఊగిసలాడాయి. ఒక దశలో అయితే సెన్సెక్స్ నాలుగు వందల పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. అయితే, చివర్లో మదుపర్లు బ్యాంకింగ్, మౌలిక వసతుల రంగాల షేర్లలో కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

దీంతో సెన్సెక్స్ 180  పాయింట్ల లాభంతో 35650 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10730 వద్ద ముగిశాయి. అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, జీ ఎంటర్ టైన్మెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాలు దండుకున్నాయి. ఇక టీసీఎస్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, సిప్లా, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. 

More Telugu News