Telangana: మిషన్‌ భగీరథ పైప్ లైన్ లో పాము.. భయాందోళనలలో గ్రామస్తులు!

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన
  • మంచి నీటిలో చనిపోయిన పాము
  • అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న స్థానికులు

తెలంగాణలో ప్రతీ ఇంటికి తాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. తాజాగా ఇలా ఏర్పాటు చేసిన వాటర్ పైపుల్లో ఓ పాము ప్రత్యక్షమయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలో గత 30 రోజులుగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న మధ్యాహ్నం నీళ్లు వస్తుండగా, ఒక్కసారిగా వాల్వ్ నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో నీళ్లు పట్టుకుంటున్న స్థానికులు భయాందోళనలకు లోనయి పరుగులు తీశారు.

ఈ సందర్భంగా పామును పైప్ నుంచి బయటకు తీయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ నేపథ్యంలో ట్యాప్ ద్వారా వస్తున్న నీటిని తాగేందుకు ప్రజలు భయపడుతున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తున్నారు.

More Telugu News