Trump: 'ఇంకా శాంతాక్లాస్ ను నమ్ముతున్నావా?' చిన్నారికి ట్రంప్ ప్రశ్న... విరుచుకుపడుతున్న ప్రజలు!

  • ఏడేళ్ల బాలుడితో చాటింగ్ చేసిన ట్రంప్
  • మత విశ్వాసాలను కించపరిచారని విమర్శలు
  • ట్విట్టర్ లో నెటిజన్ల సెటైర్లు

ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేసి, ప్రజలతో విమర్శలు కొనితెచ్చుకుంటుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి నెటిజన్లకు టార్గెట్ గా మారారు. 7 సంవత్సరాల బాలుడిని 'నువ్వు ఇంకా శాంటాక్లాస్ ను నమ్ముతున్నావా?' అని ప్రశ్నించడమే ఇందుకు కారణం.

సంప్రదాయ క్రైస్తవంలో, క్రిస్మస్ పర్వదిన వేళల్లో మంచుకురిసే కాలంలో శాంతాక్లాస్ వచ్చి బహుమతులు అందించి వెళ్తాడని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా చిన్నారులు ఎంతగానో నమ్ముతుంటారు.

ట్రంప్ తన తాజా వ్యాఖ్యలతో మత విశ్వాసాలను కించపరిచారని పలువురు విమర్శలు గుప్పించారు. "నువ్వు చస్తే స్వర్గానికేమీ వెళ్లవు. నీ శరీరాన్ని పురుగులు తింటాయి" అని ఒకరు, "ఏడేళ్ల బాలుడితో ఇలా మాట్లాడితే ఎలా?" అని మరొకరు... ఇలా సాగుతున్నాయి సెటైర్లు. మరికొందరు ట్రంప్ ను సమర్థిస్తున్నారు కూడా. పిల్లల్లోని మూడనమ్మకాన్ని తొలగించే ప్రయత్నాన్ని ఆయన చేశారని కూడా ట్వీట్లు వస్తున్నాయి. కాగా, ఈ తాజా విమర్శలపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు.

More Telugu News