Hanuma Vihari: బాక్సింగ్ డే టెస్ట్... అవకాశాన్ని వినియోగించుకోలేక పోయిన హనుమ విహారి!

  • మెల్ బోర్న్ లో ప్రారంభమైన మూడో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఓపెనర్ గా మయాంక్ తో కలసి వచ్చిన హనుమ విహారి
  • 8 పరుగులకే కుమిన్స్ బౌలింగ్ లో అవుట్

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మూడో టెస్టులో ఓపెనర్ గా తనకు లభించిన అవకాశాన్ని తెలుగు కుర్రాడు హనుమ విహారి వినియోగించుకోలేకపోయాడు. ఈ ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనర్ జోడీని మారుస్తూ, విహారి, మయాంక్ అగర్వాల్ ను తొలుత బ్యాటింగ్ కు పంపింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుమిన్స్ బౌలింగ్ లో ఫించ్ కి క్యాచ్ ఇచ్చిన హనుమ విహారి, పెవీలియన్ కు చేరాడు. ఇదే సమయంలో ఆచితూచి ఆడుతున్న మయాంక్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారాతో కలసి స్కోరును 50 పరుగులు దాటించాడు. లంచ్ విరామ సమయానికి భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు కాగా, మయాంక్ 34, పుజారా 10 పరుగులతో ఉన్నారు.

More Telugu News