dawood ibrahim: 22 ఏళ్ల తర్వాత.. దావూద్ ఇబ్రహీం బంధువును చంపిన వ్యక్తి అరెస్ట్!

  • 1991లో దావూద్ బావమరిది ఇస్మాయిల్ పార్కర్ హత్య
  • 1993లో అరుణ్ గావ్లీ గ్యాంగ్ సభ్యుడు పుజారీ అరెస్ట్
  • 1996లో బెయిల్ పై విడుదల

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువును చంపిన వ్యక్తిని 22 ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ పై వచ్చిన తర్వాత నుంచి అతను కనిపించకుండా తిరుగుతున్నాడు.

అరుణ్ గావ్లీ గ్యాంగ్ కు చెందిన దయానంద్ సలియన్ అలియాస్ పుజారీని ముంబై క్రైంబ్రాంచ్ యూనిట్-7కు చెందిన పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. గావ్లీ గ్యాంగ్ చేసిన పలు హత్యలు, హత్యాయత్నాల్లో పుజారీకి సంబంధం ఉంది. 1991లో దావూద్ ఇబ్రహీం బావమరిది ఇస్మాయిల్ పార్కర్ (దావూద్ సోదరి హసీనా భర్త) దారుణ హత్యకు గురయ్యాడు.

ఈ కేసులో 1993లో పుజారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 1996లో బెయిల్ పై పుజారీ బయటకు వచ్చాడు. అనంతరం ముంబైని వదిలేసి వెళ్లిపోయాడు. పుజారీ ఉత్తరప్రదేశ్ వెళ్లి... మారుపేరుతో ఒక వంటవాడిగా గడిపాడనేది అధికారుల కథనం.

More Telugu News