సునామీ విధ్వంసం.. 429కి చేరిన మృతుల సంఖ్య

25-12-2018 Tue 16:31
  • ఇండోనేషియాలో బీభత్సం సృష్టించిన సునామీ
  • 16,082 మంది నిరాశ్రయులు
  • 882 ఇళ్లు ధ్వంసం
ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 429 మంది మరణించినట్టు ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ వెల్లడించింది. సునామీ ధాటికి వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. తాగు నీరు కూడా లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు జ్వరం తదితర జబ్బులతో బాధపడుతున్నారు.

మరోవైపు మరో 154 మంది జాడ తెలియడం లేదు. వారికోసం భవనాల శిథిలాల కింద వెతుకుతున్నారు. మరోపక్క 1,485 మంది గాయపడ్డారు. 16,082 మంది నిరాశ్రయులయ్యారు. 882 ఇళ్లు, 73 హోటళ్లు, 60కి పైగా స్టాళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. 434 బోట్లు దెబ్బతిన్నాయి.