balakrishna: బాలకృష్ణ సినిమాకి బోయపాటి పారితోషికం 15 కోట్లు?

  • బాలకృష్ణకి భారీ హిట్లు ఇచ్చిన బోయపాటి 
  • మూడో సినిమాకి మొదలైన సన్నాహాలు 
  • ఫస్టు టైమ్ బోయపాటికి భారీ పారితోషికం    

ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలో బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా'.. 'లెజెండ్' వంటి సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ఆ రెండు సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని బాలకృష్ణ అభిమానులను బోయపాటి ఖుషీ చేశాడు.

బాలకృష్ణ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాకి పారితోషికంగా బోయపాటికి 15 కోట్లు ముడుతున్నాయనేది తాజా సమాచారం. బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థాయిలో నిలిచేలా బోయపాటి చేశాడు. తరువాత సినిమా వాటిని మించి వుంటుందనే భరోసాను కూడా ఇచ్చాడు. అందువలన బోయపాటికి ఈ స్థాయి పారితోషికాన్ని ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. ఈ స్థాయి పారితోషికం అందుకోవడం బోయపాటికి ఇదే ఫస్టుటైమ్ అని అంటున్నారు. 

More Telugu News