samantha: భర్తతో కలిసి సమంత క్రిస్మస్ వేడుకలు!

  • క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించిన సమంత 
  • ఆ ట్రీ ముందు నిలబడి ఫొటోలకు పోజులు 
  • సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న ఫొటోలు

ప్రముఖ నటి సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. తమ ఇంట్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీని చక్కగా అలంకరించిన సమంత, నాగ చైతన్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. కాగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో సమంత నటిస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

More Telugu News