Balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఎవరు ఏ పాత్రలో... పూర్తి జాబితా!

  • బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్
  • క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
  • బాలకృష్ణ పాత్ర ఎవరు చేశారన్నది సస్పెన్స్

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' పేరిట రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు భాగాలలోనూ ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో తెలియజేసే పూర్తి జాబితా ఇది.

ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ, ఆయన భార్య బసవ రామతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో నందమూరి త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణగా కల్యాణ్ రామ్, లోకేశ్వరిగా పూనమ్ బజ్వా, భువనేశ్వరిగా మంజిమా మోహన్, సాయికృష్ణగా గారపాటి శ్రీనివాస్, పురంధేశ్వరిగా హిమన్సీ, ఉమామహేశ్వరిగా హీరోషిని కోమలి, నందమూరి రామకృష్ణగా రోహిత్ భరద్వాజ్ నటించారు.

ఇక ఇదే చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, రామోజీరావుగా గిరీష్, ఎస్వీ రంగారావుగా ఈశ్వర్ బాబు, నారా చంద్రబాబునాయుడుగా దగ్గుబాటి రానా, మండలి వెంకటకృష్ణారావుగా మండలి బుద్ధప్రసాద్, హెచ్‌ఎం రెడ్డిగా కైకాల సత్యనారాయణ, దాసరి నారాయణరావుగా చంద్ర సిద్ధార్థ్, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, ఆలూరి చక్రపాణిగా మురళీ శర్మ, ఎల్వీ ప్రసాద్ గా జిషు సేన్ గుప్తా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నాదెండ్ల భాస్కరరావుగా సచిన్ ఖేదేకర్, బీఏ సుబ్బారావుగా నరేష్, పీ పుల్లయ్యగా శుభలేఖ సుధాకర్ నటించారు.

ఇక కేవీ రెడ్డిగా క్రిష్ జాగర్లమూడి, పీతాంబరంగా సాయి మాధవ్ బుర్రా, విఠలాచార్యగా ఎన్. శంకర్, కృష్ణకుమారిగా ప్రణీత సుభాష్, వెంపటి చినసత్యంగా శివ శంకర మాస్టర్, సావిత్రిగా నిత్యా మీనన్, జయప్రదగా హన్సికా మోత్వాని, ప్రభగా శ్రియ, జయసుధగా పాయల్ రాజపుత్, యోగానంద్ గా రవి ప్రకాష్, తాతినేని ప్రకాష్ రావుగా ఇంటూరి వాసు, టీవీ రాజుగా సురభి జయచంద్ర, పేకేటి శివరాంగా భద్రం, షావుకారు జానకిగా షాలిని పాండే, పింగళిగా సంజయ్, మార్కస్ బార్ట్ లేగా అర్జున ప్రసాద్, గుమ్మడిగా దేవీ ప్రసాద్, జీ వరలక్ష్మీగా ప్రత్యూష, పుండరీ కాక్షయ్యగా నాగేశ్వరరావు, కమలాకర కామేశ్వర రావుగా ఎస్వీ కృష్ణారెడ్డి నటించారు.

వీరితో పాటు ఇందిరాగాంధీగా సుప్రియా వినోద్, సి నారాయణరెడ్డిగా రామజోగయ్య శాస్త్రి, ఎమ్జీ రామచంద్రన్ గా సికిందర్, కన్నప్పగా సునీల్ కుమార్ రెడ్డి, డీవీ నరసరాజుగా అవసరాల శ్రీనివాస్, కే రాఘవేంద్రరావుగా కే ప్రకాష్, సలీం మాస్టర్ గా రఘు మాస్టర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, చలమేశ్వర్ రావుగా నాగరాజ్, రుఖ్మాంగధ రావుగా వెన్నెల కిషోర్ నటించారు. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషించారన్న విషయాన్ని ప్రస్తుతానికి చిత్ర టీమ్ సస్పెన్స్ లో ఉంచింది.

More Telugu News