Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళంలో హిట్ కొట్టిన రాశిఖన్నా 
  • రజనీకాంత్ సినిమా నిడివి ఎక్కువే!
  • ప్రత్యేకమైన సెట్లో 'చిత్రలహరి' షూటింగ్

*  రాశిఖన్నా తాజాగా జయం రవితో కలసి నటించిన 'ఆదంగ మారు' తమిళ చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. దీంతో ఈ ముద్దుగుమ్మ చాలా ఖుషీ అవుతోంది. 'ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది' అంటోంది రాశి. ప్రస్తుతం ఆమె తమిళంలో 'టెంపర్' రీమేక్ లోను, అలాగే సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.
*  రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'పెట్టా' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రం నిడివి కాస్త ఎక్కువగా వుందని తెలుస్తోంది. ఈ చిత్రం 'రన్ టైం' 2 గంటల 52 నిమిషాలు వచ్చినట్టు సమాచారం.
*  సాయిధరం తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'చిత్రలహరి' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. రామానాయుడు స్టూడియోలో కోటి రూపాయలతో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారు.

More Telugu News