Vivo Y93: భారత్ కి వచ్చేసిన 'వివో వై93' స్మార్ట్ ఫోన్!

  • గత నెల చైనాలో విడుదలైన వై93
  • ఫోన్ ధర రూ.13,990
  • రెండు వేరియంట్లలో లభ్యం

గత నెలలో చైనాలో విడుదలైన 'వివో వై93' స్మార్ట్ ఫోన్ తాజాగా నేడు భారత మార్కెట్లో విడుదలైంది. స్టారీ నైట్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ రూ.13,990 ధరకి మార్కెట్లో లభించనుంది. కాగా, ఈ ఫోన్ కొనుగోలుపై బజాజ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ పలు ఆఫర్లని కూడా ప్రకటించింది.

వివో వై93 ఫీచర్లు:

  • 6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (1580 x 720 పిక్సల్స్)
  • మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్
  • 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4030 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News