Bollywood: కేన్సర్ బాధిత చిన్నారులతో ఐశ్వర్యారాయ్ క్రిస్మస్ వేడుకలు.. ఫొటోలు వైరల్!

  • ముంబైలోని ఆసుపత్రిలో కార్యక్రమం
  • చిన్నారులతో ఆడిపాడిన ఐశ్వర్య
  • ఐష్ తో ఫొటోల కోసం పోటీపడ్డ చిన్నారులు

ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన మంచి మనసును చాటుకుంది. ఈసారి క్రిస్మస్ వేడుకలను ఐశ్వర్య ముంబైలోని ఓ కేన్సర్ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి జరుపుకుంది. కేన్సర్ తో బాధపడుతున్న చిన్నారులకు బహుమతులను అందించిన ఐష్, వారితో కలిసి పాటలకు స్టెప్పులేసింది. ఈ సందర్భంగా చిన్నారులంతా ఐశ్వర్యారాయ్ తో కలిసి ఫొటోలు దిగారు. కాగా, ఐశ్వర్యారాయ్ చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.

More Telugu News