mahakutami: మహాకూటమికి కొత్త నిర్వచనం ఇచ్చిన మోదీ

  • వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మహాకూటమి
  • అవకాశవాదుల కూటమిని ప్రజలు గమనిస్తున్నారు
  • అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ పని

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న మహాకూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. మహాకూటమిని 'రాజ వంశీకుల క్లబ్'గా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు మహాకూటమిగా ఏర్పడుతున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశవాదుల కూటమిని ప్రజలు గమనిస్తున్నారని... ఈ కూటమిని ఎవరూ విశ్వసించరని అన్నారు. ఈరోజు నార్త్ చెన్నై, సెంట్రల్ చెన్నై, మధురై, తిరువళ్లూరు, తిరుచిరాపల్లి బూత్ లెవెల్ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు.

జైన్ కమిషన్ విషయంలో కాంగ్రెస్, డీఎంకేల వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందేనని మోదీ అన్నారు. ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ముమ్మాటికీ అవకాశవాదమేనని విమర్శించారు. అబద్ధాలు చెప్పడమే పనిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. తమను తాము కాపాడుకోవడమే మహాకూటమి నేతల లక్ష్యమని చెప్పారు. 2019 ఎన్నికలకు గాను బీజేపీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

More Telugu News