Tamilnadu: తల్లీ.. ముందు ప్రాణాలతో మిగిలితే, ఆ తర్వాత మేకప్ వేసుకోవచ్చు!: మహిళలకు తమిళనాడు మంత్రి చురకలు

  • హెల్మెట్ లేకుండా మహిళల ప్రయాణం
  • పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
  • తీవ్రంగా స్పందించిన మంత్రి భాస్కర్

సాధారణంగా చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపటానికి ఇష్టపడరు. తమ హెయిర్ స్టయిల్ పాడైపోతుందనీ, జట్టు ఊడిపోతుందని రకరకాల కారణాలు చెబుతుంటారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చనిపోతున్నవారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయభాస్కర్ తీవ్రంగా స్పందించారు.

చాలామంది మహిళలు స్కూటీలపై హెల్మెట్ లేకుండానే వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ..‘మహిళలు ప్రాణం కంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ముఖానికి వేసుకున్న మేకప్‌ పాడవుతుందని, శిరోజాల అందం తగ్గుతుందని హెల్మెట్లు ధరించకుండా చావును కొనితెచ్చుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ముందు ప్రాణాలతో బతికి ఉంటే ఆ తర్వాత ఎంచక్కా మేకప్ వేసుకోవచ్చు’ అని చురకలు అంటించారు.

More Telugu News