Andhra Pradesh: తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • హోదా, విభజన హామీల అమలుపై విడుదల
  • ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని మండిపాటు
  • కేంద్రం అణగదొక్కేందుకు యత్నిస్తోందని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా బాధపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సమయంలో తీవ్ర ఆందోళనలో ఉన్న ఏపీ ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, విశ్వాసం నింపేందుకు ఓ అనుభవమున్న నేతగా ప్రయత్నించానని వెల్లడించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మొదటి నుంచి తాను పోరాడుతూనే ఉన్నానని పేర్కొన్నారు. విభజన చేసినా, చేయకపోయినా ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలని తాను కోరానన్నారు. అమరావతిలో ఈ రోజు ‘ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు’పై చంద్రబాబు మొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

ఏపీకి సంబంధించిన విభజన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో చేరిస్తే, బీజేపీ దాన్ని అమలు చేయకుండా వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చట్టంలో విభజన హామీలను చేర్చినప్పటికీ బీజేపీ అసలు చట్టాన్నే అమలు చేయకుండా వ్యవహరించిందని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేసిన నిర్వాకాన్ని బయటపెట్టేందుకే శ్వేతపత్రాన్ని తీసుకొచ్చామన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీని అణగదొక్కేందుకు కేంద్రం యత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

More Telugu News