delhi high court: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ‘సుప్రీం’ను ఆశ్రయించిన సజ్జన్ కుమార్

  • సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ దోషి 
  • లొంగిపోయేందుకు గడువు కావాలన్న సజ్జన్
  • ఆ పిటిషన్ ని ఇటీవలే కొట్టేసిన హైకోర్టు

ముప్పై ఏళ్ల క్రితం నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్ ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చి ఆయనకు యావజ్జీవ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, సజ్జన్ కుమార్ కు యావజ్జీవ శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు.. ఈ నెల 31లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, తాను లొంగిపోవడానికి ఒక నెల రోజుల గడువు కావాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన సజ్జన్ కుమార్ పిటిషన్ ని ఇటీవలే కొట్టి వేసింది. తన కుటుంబ, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలను పరిష్కరించుకునే నిమిత్తం తనకు ఈ గడువు కావాలని సజ్జన్ కోరారు. అయితే, సజ్జన్ గడువు పొడిగించేందుకు అవసరమైన కారణాలు తమకు కనబడటం లేదని పేర్కొంటూ హైకోర్టు ఆ పిటిషన్ ని తిరస్కరించింది. 

More Telugu News