Andhra Pradesh: వైసీపీలో చేరిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే.. కండువా కప్పి ఆహ్వానించిన జగన్!

  • రావివలసలో జగన్ సమక్షంలో చేరిక 
  • ప్రజారాజ్యం తరఫున గెలుపొందిన రాంబాబు
  • టీడీపీ తరఫున పోటీచేసి పరాజయం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో 328వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దామోదరపురం క్రాస్ నుంచి రావివలస, నౌపడ క్రాస్‌, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకూ జగన్ పాదయాత్ర సాగనుంది. మరోవైపు రావివలసలో జగన్ ను మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ఈ రోజు కలుసుకున్నారు. అనుచరులతో కలిసి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 ఈ సందర్భంగా రాంబాబుకు పార్టీ కండువా కప్పిన జగన్ ఆయన్ను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్ పై గిద్దలూరు నియోజకవర్గం నుంచి రాంబాబు గెలుపొందారు. 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఇటీవలి కాలంలో రాంబాబు వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అన్నా రాంబాబు చేరికపై ప్రకాశం జిల్లాలో ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News