USA: హెచ్-1బీ వీసాల దరఖాస్తులు పెరుగుతున్నాయి.. ఇకపై అత్యంత ప్రతిభావంతులకే!: అమెరికా అధికారులు

  • ప్రతి ఏటా హెచ్ -1బీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది
  • స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఈ నిర్ణయం
  • అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటే మేలు 

యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో కొచ్చాక ‘హెచ్ -1బీ’ వీసాల జారీ కఠినతరం చేసేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ట్రంప్ సర్కార్ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది హెచ్-1బీ వీసాల నిమిత్తం వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే ఈ వీసాలు జారీ కానున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టెన్ నీల్సన్ మాట్లాడుతూ, ప్రతి ఏటా హెచ్ -1బీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని, ఈ దరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకుంటే కంపెనీలకు మేలు జరుగుతుందని, పనిలో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తమ పౌరులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలని, స్థానిక నియామకాల సంఖ్య మరింతగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

More Telugu News