rafel deal: రాఫెల్ డీల్ కు 15 రోజుల ముందే అనిల్ అంబానీ కంపెనీని రిజిస్ట్రేషన్ చేశారు: పుదుచ్ఛేరి సీఎం ఆరోపణలు

  • వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది
  • మోదీ వ్యక్తిగత నిర్ణయంపైనే ఈ డీల్ జరిగింది
  • ‘రాఫెల్’ పై జేపీసీని నియమించాలి

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ డీల్ కు పదిహేను రోజుల ముందే రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ కంపెనీని రిజిస్ట్రేషన్ చేశారని పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. ఫ్రాన్స్ పర్యటనకు మోదీ తనతో పాటు అనిల్ అంబానీని తీసుకెళ్లారని, అంబానీకి లాభం చేకూర్చడానికి దేశ భద్రతను పణంగా పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

 కేవలం, మోదీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడే రాఫెల్ డీల్ జరిగిందని విమర్శించారు.  ఈ సందర్భంగా ‘రాఫెల్’ పై సుప్రీంకోర్టును ప్రధాని మోదీ తప్పుదోవ పట్టించారని, దీంతో, సర్వోన్నత న్యాయస్థానం పచ్చి అబద్ధాలు మాట్లాడిందని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నిస్తే, పార్లమెంట్ సమావేశాలు జరగకుండా బీజేపీ అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని, లేదంటే ఇంటింటికీ తిరిగి ఈ కుంభకోణం గురించి ప్రజలకు వివరిస్తామని ఆయన హెచ్చరించారు. 

More Telugu News