West Bengal: అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ.. ‘సీఎం ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక

  • ఉత్తమ పనితీరుకు దక్కిన అవార్డు
  • శుభాకాంక్షలు తెలిపిన స్కోచ్
  • కన్యశ్రీ పథకంపై ఐరాస ప్రశంసలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు ఆమెను ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబెట్టాయి. ఈ ఏడాది అత్యుత్తమ పాలన అందించినందుకు గాను స్కోచ్ ‘సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు మమత ఎంపికయ్యారు. ఈ మేరకు స్కోచ్ బృందం మమతకు శుభాకాంక్షలు తెలిపింది. సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించింది. పట్టణాలు, గ్రామాల అభివృద్ధి, పరిపాలనతో అత్యుత్తమంగా వ్యవహరించినందుకు గాను మమతను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘కన్యశ్రీ’ పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ పథకాన్ని ఆడ శిశువుల సంరక్షణ, పోషణ కోసం అమలు చేస్తునందుకు గాను ‘అత్యున్నత ప్రజాసేవ’ అవార్డుతో ఐక్యరాజ్య సమితి గతేడాది మమతను సత్కరించింది.  అలాగే, కార్మికుల కోసం ‘వంద రోజుల పని’ పథకం కూడా మమతకు మంచి పేరు తీసుకొచ్చింది.

More Telugu News