Andhra Pradesh: ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే బోండా

  • ఏపీకి అదనంగా కేంద్రం ఎటువంటి నిధులు ఇవ్వలేదు
  • ఏపీకి ఇచ్చిన నిధులపై కేంద్రం శ్వేతపత్రం ఇవ్వాలి
  • గుంటూరులో మోదీ పర్యటనకు ముందే ఇది జరగాలి

కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులపై ఓ శ్వేతపత్రం విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇవ్వలేదని అన్నారు. వచ్చే నెల 6న గుంటూరు పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారని, ఈ పర్యటనకు ముందుగానే ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గుంటూరు పర్యటనకు రానున్న మోదీని ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై నిలదీస్తామని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా తాము ఉన్న సమయంలోనే మోదీని నిలదీశామని, ఇక, ఇప్పుడెందుకు నిలదీయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లపై ఆయన విమర్శలు చేశారు.

తమ ఇష్టానుసారం మాట్లాడుతున్న ఇటువంటి నేతలను ఏపీపైకి మోదీ, అమిత్ షా లు వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నిలబెట్టుకోలేదని, ఇంకా, ఏ మొహం పెట్టుకుని ఆయన తమ రాష్ట్రంలో పర్యటిస్తారని ప్రశ్నించారు. 

More Telugu News