santa: శాంతాక్లాజ్‌ వేషంలో ఒబామా.. చిన్నారులతో ఆటపాటలు!

• శాంతాక్లాజ్ టోపీ, భుజాన కానుకల సంచి
• వాషింగ్టన్ లోని పిల్లల ఆసుపత్రికి వెళ్లిన ఒబామా
• చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు ఇలాగే ఉండాలని ఆకాంక్ష

క్రిస్మస్ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శాంతాక్లాజ్ అవతారం ఎత్తారు. శాంతాక్లాజ్ టోపీ పెట్టుకుని, భుజాన కానుకల సంచిని వేసుకుని వాషింగ్టన్ లోని ఓ చిన్నపిల్లల ఆసుపత్రికి వెళ్లి అక్కడున్న వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. పిల్లలకు క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. వారితో ఆడిపాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఒబామా పంచుకున్నారు. పిల్లలతో ఆడుకునే అద్భుతమైన అవకాశాన్ని తనకు కల్పించిన ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నారుల ముఖాల్లోని ఈ చిరునవ్వులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని అభిలషించారు.

Thank you @BarackObama for making our patients’ day so much brighter. Your surprise warmed our hallways and put smiles on everyone’s faces! Our patients loved your company…and your gifts! https://t.co/bswxSrA4sQ ❤️ #HolidaysAtChildrens #ObamaAndKids pic.twitter.com/qii53UbSRS
— Children's National

More Telugu News