varun: 'అంతరిక్షం'పై ఆసక్తిని పెంచుతోన్న ప్రమోషనల్ వీడియో

  • వరుణ్ తేజ్ నుంచి 'అంతరిక్షం'
  • సామాన్య ప్రేక్షకుల్లో సందేహాలు
  • సందేహాలకు సమాధానంగా వదిలిన వీడియో      

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' సినిమాను రూపొందించాడు. తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతరిక్షానికి సంబంధించి అంతసేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం సహజం. అసలు ఈ సినిమా ఏయే అంశాలను టచ్ చేస్తూ వెళుతుంది? తాము ఆశించేవి ఈ తరహా సినిమాలో వుంటాయా? అనే విషయాలను తెలుసుకోవాలని అనిపిస్తుంది.

అందువల్లనే తెలివిగా ఈ సినిమా టీమ్ వరుణ్ తేజ్ తో ఒక వీడియో చేసి వదిలింది. ఈ సినిమాలో ఏయే అంశాలు చోటుచేసుకున్నది ఈ వీడియో ద్వారా తెలియజేశారు. సినిమానే ప్రయోగాత్మకం అనుకుంటే, ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా వీడియోతో ఈ సినిమా టీమ్ ప్రయోగాత్మక ప్రయత్నమే చేసింది. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగుందనే చెప్పాలి.

More Telugu News